భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్ కోటా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడల్లో ప్రతిభ ఉన్న అభ్యర్థులు నేరుగా ట్రయల్స్ ద్వారా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
పోస్టు పేరు: అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్ కోటా).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి గణితం, భౌతికశాస్త్రం, ఇంగ్లిషు సబ్జెక్టులుగా కనీసం 50 శాతం మార్కులతో 10+2/ ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా
గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇనుస్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఐటీ విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి నాన్ ఒకేషనల్ సబ్జెక్టులైన ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఒకేషనల్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నాలుగేండ్ల సర్వీసు కాలంలో వివాహం చేసుకోకూడదు. ఒకవేళ వివాహం జరిగితే సర్వీసు నుంచి తొలగిస్తారు.
స్పోర్ట్స్ అచీవ్ మెంట్స్
- అభ్యర్థి కింద పేర్కొన్న ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొని ఉండాలి.
- అంతర్జాతీయ/ జాతీయ/ రాష్ట్ర స్థాయి పోటీలు.
- యూనివర్సిటీ స్థాయి పోటీలు.
- ఖేలో ఇండియా గేమ్స్ లేదా జాతీయస్థాయి స్కూల్ పోటీలు.
శారీరక ప్రమాణాలు
ఎత్తు: కనీసం 152.5 సెం.మీ.
ఛాతి: గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ విస్తరించాలి.
బరువు: ఎత్తు, వయసుకు అనుగుణంగా ఉండాలి.
వయోపరిమితి: 2005, జులై 2 నుంచి 2009, జనవరి 2 మధ్యలో జన్మించి ఉండాలి. ఎన్‌రోల్‌మెంట్ నాటికి గరిష్ట వయస్సు 21 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 23.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.100 చెల్లించాలి.
లాస్ట్ డేట్: మార్చి 29.
రిక్రూట్‌మెంట్ ట్రయల్స్: ఏప్రిల్ 08 నుంచి ఏప్రిల్ 10 వరకు
మెడికల్ ఎగ్జామినేషన్: ఏప్రిల్ 14 నుంచి
సెలెక్షన్ ప్రాసెస్: స్పోర్ట్స్ కోటా ఎంపికలో రాత పరీక్ష ఉండదు. ఎంపిక పూర్తిగా క్రీడా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన, 1.6 కి.మీ పరుగు, పుష్- అప్స్, సిట్- అప్స్, స్క్వాట్స్, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు కర్ణాటకలోని బెల్గాం ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ సెంటర్ లేదా నిర్ణీత శిక్షణ కేంద్రాల్లో ప్రాథమిక సైనిక శిక్షణ ఇస్తారు.
జీతభత్యాలు: అగ్నివీర్ పథకం కింద నాలుగేండ్ల కాలానికి నియమిస్తారు.
మొదటి సంవత్సరం: నెలకు రూ. 30,000 (చేతికి రూ. 21,000 వస్తుంది, మిగిలిన రూ. 9,000 కార్పస్ ఫండ్‌కు వెళ్తుంది).
వార్షిక పెరుగుదల: ప్రతి సంవత్సరం జీతం పెరుగుతూ 4వ సంవత్సరంలో రూ. 40,000 కి చేరుతుంది.
సేవా నిధి: 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేటప్పుడు వడ్డీతో కలిపి రూ. 10.04 లక్షలు అందుతాయి.
రిజర్వేషన్: 4 ఏళ్ల తర్వాత 25% మందిని శాశ్వత ప్రాతిపదికన నేవీలోకి తీసుకుంటారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ agnipathvayu.cdac.in ను సందర్శించండి.
